**బతుకమ్మ** తెలంగాణ ఆడపడుచుల సమ్మేళనం,తీరొక్క పువ్వు తో బతుకమ్మకు హారం,పూలతో ప్రకృతిని పూజించే ప్రత్యేక దైవం. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని నేడు,కూని చేసి ఆడుకుంటున్నాము ఈనాడు. అడుగడుగున ఆడపిల్లలకు ఆటంకాలు,బతుకమ్మలపై పెరుగుతున్న కీచక కుట్రలు. చిన్నారులను చిదిమేస్తున్న కామాంధులు,బంగారు తల్లులకు రక్షణలేని ఈ రోజులు. బతుకునిచ్చే బతుకమ్మగా గౌరవిద్దాం,ప్రతి ఇంటి ఆడబిడ్డ రక్షణకు భరోసానిద్దాం. మానవాళి మనుగడకు బతుకమ్మ,కలకాలం బ్రతకాలి మనం, మన బతుకమ్మ.. – రాజు సౌడం, cell : 9951817808