**బతుకమ్మ**

**బతుకమ్మ**


తెలంగాణ ఆడపడుచుల సమ్మేళనం,
తీరొక్క పువ్వు తో బతుకమ్మకు హారం,
పూలతో ప్రకృతిని పూజించే ప్రత్యేక దైవం.


ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని నేడు,
కూని చేసి ఆడుకుంటున్నాము ఈనాడు.

అడుగడుగున ఆడపిల్లలకు ఆటంకాలు,
బతుకమ్మలపై పెరుగుతున్న కీచక కుట్రలు.

చిన్నారులను చిదిమేస్తున్న కామాంధులు,
బంగారు తల్లులకు రక్షణలేని ఈ రోజులు.

బతుకునిచ్చే బతుకమ్మగా గౌరవిద్దాం,
ప్రతి ఇంటి ఆడబిడ్డ రక్షణకు భరోసానిద్దాం.


మానవాళి మనుగడకు బతుకమ్మ,
కలకాలం బ్రతకాలి మనం, మన బతుకమ్మ..


                     – రాజు సౌడం, cell : 9951817808

Leave a comment

Design a site like this with WordPress.com
Get started